Telangana Assembly Meetings : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు ఉభయ సభలు ప్రారంభవుతాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించునున్నారు.

Telangana Assembly Meetings : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana Assembly

Updated On : February 3, 2023 / 7:17 AM IST

Telangana Assembly meetings : నేటి నుంచి తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు ఉభయ సభలు ప్రారంభవుతాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించునున్నారు. రెండేళ్ల అనంతరం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. 2023-24 వార్షిక బడ్జెట్ ను ఈనెల 6న ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కొత్త సమావేశం కానుండంతో గత ఏడాది బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేదు. అయితే, దీనిపై రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రేగింది. ప్రస్తుతం కూడా గత సమావేశాలు కొనసాగిస్తూ గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేదని మొదట ప్రభుత్వం ప్రకటించింది. కానీ తన ప్రసంగం లేకపోవడంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై మొదటి అనుమతి ఇవ్వలేదు.

Fire Broke Out : తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం

దీనిపై ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు ఇరు పక్షాల న్యాయవాదులు చర్చల అనంతరం రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. అందుకనుగుణంగా ఇవాళ ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగనుంది.