MLC Kavitha : ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత .. శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి అంటూ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కువినియోగించుకున్నారు. అనంతరం శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha vote : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే పలువురు వారి వారి పరిధిలోని కేంద్రాల్లో ఓటు వేశారు.
అలాగే..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతు.. తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. నగరాలు, పట్టణాల్లోని వారు, యువత పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అంతేకాదు..ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ రక్షణ కోసం దేశసరిహద్దుల్లో సైనికులు బయటి నుండి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తారు..
కానీ మనతో ఉండే శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి..
మనతో పాటె మన పిల్లల భవిష్యత్ కోసం కాసేపు లైన్ ఉన్నా భరిద్దాం..
అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి…
అంటూ పిలుపునిచ్చారు.
దేశ రక్షణ కోసం బార్డర్ లో సైనికులు బయటి నుండి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తారు….
కానీ మనతో ఉండే శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి.
మనతో పాటె మన పిల్లల భవిష్యత్ కోసం కాసేపు లైన్ ఉన్నా భరిద్దాం
అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి.I have casted my vote! My request… pic.twitter.com/sV2foHFNUs
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2023