Telangana Assembly Election 2023 : కొనసాగుతున్న పోలింగ్, ఓటుహక్కు వినియోగించుకున్న రాజకీయ నేతలు

తెలంగాణలో ఓట్ల పండుగ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అయినా సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.

Telangana Assembly Election 2023 : కొనసాగుతున్న పోలింగ్, ఓటుహక్కు వినియోగించుకున్న రాజకీయ నేతలు

Telangana Assembly Election

Updated On : November 30, 2023 / 8:41 AM IST

Telangana Assembly Election 2023 : తెలంగాణలో ఓట్ల పండుగ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అయినా సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి,ఖమ్మం గొల్లగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు వంటి పలువురు రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అలాగే..కుటుంబ సమేతంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ వాసవి కాలేజీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ 89లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లాలో పర్వతగిరి జెడ్పీఎస్ఎస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ప్రజలంతా ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

నల్గొండ జిల్లా..మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలోని 102 పోలింగ్ కేంద్రంలో టిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. అంబర్ పేటలో డీజీపీ అంజనీకుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచీగూడలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఓటు వేశాను. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

కాగా..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి.  హైదరాబాద్ లోని చిలుకానగర్, సిద్ధిపేటలో 118 కేంద్రాలు, సూర్యాపేటలో 89, కరీంనగర్ లో 371 కేంద్రాల్లోను సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని వాణీనగర్ వంటి పలు కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయక పోలింగ్ ఆలస్యమవుతోంది.