Telangana : డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!.. తాత్కాలిక ఎలక్షన్ షెడ్యూల్

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం ఫులు బెంచ్ అక్టోబర్ 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించనుంది.

Telangana : డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!.. తాత్కాలిక ఎలక్షన్ షెడ్యూల్

Telangana assembly elections (1)

Telangana Assembly Elections : జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మాత్రం విడిగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి 19న నామినేసన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉససంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్ 22న అభ్యర్థుల తుది జాబితా (ఫారం-7ఏ) ప్రకటించనున్నారు. డిసెంబర్ 11న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తాత్కాలిక ఎన్నికల షెడ్యూల్ రూపొందించింది. దీనిని అనుసరించే ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ కార్యక్రమాలకు గడువు కూడా నిర్ధేశించారు.

ఈ మేరకు దీనికి సంబంధించిన ఫ్లెక్సీని ముద్రించి కార్యాలయ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు. 2018లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల షెడ్యూల్ సైత ఇదే కావడం గమనించాల్సిన విషయం. అయితే కొన్ని రోజులు అటు ఇటుగా ఇదే షెడ్యూల్ తో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిజానికి తెలంగాణ సహా ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అక్టోబర్ మొదటివారం లేదా ఆ తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంంది.

Also Read : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : ఎన్నికల అధికారి వికాస్ రాజ్

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం ఫులు బెంచ్ అక్టోబర్ 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. ఆ తర్వాత వాస్తవ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. నిర్దిష్ట తేదీలు, నిర్దిష్ట గడువులతో వచ్చే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రోజు వారీగా చేయాల్సిన కార్యక్రమాలతో ఎన్నికల సంఘం క్యాలండర్ రూపొందించింది. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ లకు ప్రథమ స్థాయి తనిఖీలు పూర్తయ్యాయి.

ఎన్నికల సామాగ్రి సమీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ ఎంపిక, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన లేదా నిర్ధారణ, దర్యాప్తు సంస్థల నోడల్ అధికారులు లేదా సహాయ వ్యయ పరిశీలకులు, లేదా వ్యయ పర్యవేక్షణ బృందాలు లేదా రిటర్నింగ్ అధికారులు లేదా సెక్టార్ అధికారులకు వేర్వేరుగా శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు, అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన ధరల ఖరారు, ప్లైయింగ్ స్క్వాడ్స్ లేదా స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్స్ లేదా వీడియో సర్వేలియన్స్ టీమ్ ల ఏర్పాటు తదితర పనులన్నీ వచ్చే అక్టోబర్ నెలలోగా పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం నిర్ధేశించుకుంది.

నవంబర్ లో వివిధ స్థాయిల్లోని అధికారులకు శిక్షణ, పోలింగ్ సిబ్బందికి నియామక ఆదేశాల జారీ, సోషల్ మీడియాపై పర్యవేక్షణ, ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్, వ్యయ పరిశీలకులకు శిక్షణ, పోలింగ్ కేంద్రాల ప్రకటన, వికలాంగులు లేదా 80 ఏళ్లకు పైబడిన వయోవృద్ధులైన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు కల్పించడానికి ఫారం 12డీ దరఖాస్తుల స్వీకరణ, సీ-విజిల్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల స్వీకరణ, పెయిడ్ వార్తలపై సమీక్ష, ఎన్నికల్లో వినియోగించేందుకు సమీకృత ఓటర్ల జాబితా ప్రకటన ఉంటుంది.

Also Read : తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్టే.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎలక్షన్స్!

పోలింగ్ లేదా కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, బ్యాలెట్ పత్రాల ముద్రణ, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ, ఈవీఎంలకు రెండో ర్యాండమైజేషన్ నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ లేదా స్వీకరణ తదితరాలన్నీ పూర్తి చేయాలి. డిసెంబర్ నెలలో పోలింగ్ సిబ్బందికి తుది శిక్షణ, పోలింగ్ కేంద్రాలకు రవాణా సదుపాయ కల్పన, పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం అమ్మకాలపై నిషేదం, పోలింగ్ , కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలి.

ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు అయింది. అక్టోబర్ 3 నుంచి మూడు రోజులపాటు ఈసీ బృందం తెలంగాణలో పర్యటించనుంది. అక్టోబర్ 4న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానుంది. అక్టోబర్ 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం అవ్వనుంది. ఈవీఎంల నిర్వహణపై ఈసీఐఎల్ అధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. అక్టోబర్ 6న తెలంగాణ ఎన్నికలపై నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.