Telangana : సభకు వేళాయే..ఏ అంశాలపై చర్చిస్తారంటే

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల సమరానికి శాసనసభ వేదికగా మారనుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌ జరిగే ఛాన్సుంది.

Telangana : సభకు వేళాయే..ఏ అంశాలపై చర్చిస్తారంటే

Tg Assembly

Updated On : September 27, 2021 / 7:49 AM IST

Telangana Assembly : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల సమరానికి శాసనసభ వేదికగా మారనుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌ జరిగే ఛాన్సుంది. ముఖ్యంగా దళిత బంధు పథకంపై సభ దద్దరిల్లే అవకాశాలున్నాయి. హుజురాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా దళితబంధు అమలవుతుండగా… రాష్ట్రమంతా తీసుకు రావాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయంపై అధికార పార్టీని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే బీసీలు, పేదల సంగతేంటో చెప్పాలని ప్రశ్నిస్తామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. పోడు భూములు, కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులతో పాటు మూడెకరాల భూ పంపిణీ, నిరుద్యోగ భృతిపైనా కేసీఆర్‌ సర్కార్‌ను నిలదీసేందుకు బీజేపీ అస్త్రాలు రెడీ చేసుకుంది.

Read More : Amazon-Flipkart పోటాపోటీ : ఆఫర్లే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు!

అలాగే నదీ జలాల వివాదం, ఇరిగేషన్, నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, డ్రగ్స్, వైట్ ఛాలెంజ్, పంట కొనుగోళ్లు, ధరణి సహా కీలక అంశాలపైనా చర్చకు పట్టుబట్టే అవకాశముంది. మరోవైపు ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడానికి అధికార పార్టీ సభ్యులు సిద్ధమయ్యారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ఘాటుగా సమాధానం ఇవ్వాలని మంత్రులందరికీ… సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దీంతో మంత్రులంతా తమ శాఖలపై అప్‌డేట్‌ ఇన్ఫర్మేషన్‌ తీసుకుని చర్చలకు రెడీ అవుతున్నారు.

Read More : Hyderabad : నగర వాసులకు ముఖ్యగమనిక, బయటకు వెళుతున్నారా..ఒక్క నిమిషం ఆగండి

ఇక అసెంబ్లీని గౌరవంగా నడిపించాలని స్పీకర్‌ను కోరిన కేసీఆర్‌… ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధిపై చర్చించేలా సభను ఆర్డర్‌లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అర్థవంతమైన చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలని ఇప్పటికే బీఏసీ సమావేశంలో సూచించారు. అయితే హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో… టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు అసెంబ్లీని వేదికగా వాడుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. విపక్షాలు వ్యక్తిగత మైలేజీ కోసమే పాకులాడితే… వారికి గట్టిగా సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ సభ్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 8 రోజులపాటు జరగనున్నాయి. ఈ సెషన్‌లో ప్రభుత్వం ఏడు బిల్లుల్ని ఆమోదించనుంది.