Telangana Assembly: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. రేవంత్, అదానీ ఫొటోలున్న టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను

BRS MLAs
Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్దనే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావుసహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి, గౌతమ్ అదానీ ఫొటోలతో కూడిన టీషర్ట్ లను ధరించి అసెంబ్లీ వద్దకు వచ్చారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కేటీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని వారిని ప్రశ్నించడంతో.. టీషర్ట్ లతో లోపలికి అనుమతించమని సమాధానం ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అంతకుముందు బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరులకు జోహార్, వీరులకు జోహార్ అంటూ పాటపాడారు. అసెంబ్లీ గేటు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకోవటంతో రేవంత్, అదానీ భాయి భాయి.. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది.. బతుకమ్మను తీసి కాంగ్రెస్ ప్రభుత్వం చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. అయితే, కొద్దిసేపటి తరువాత బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు.