Toy Train in Nirmal school : చిన్నారులూ..భలే భలే..టాయ్ ట్రైన్ లో బడికి పోదామా?
స్కూల్ పిల్లలు చుక్ చుక్ బండి అంటూ రైలు ఆట ఆడుకుంటుంటారు. అటువంటిది రైలు స్కూల్ కే వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలాఉంటుంది. ఇదిగో ఇక్కడ టాయ్‌ట్రైన్‌లో పిల్లల హడావుడి చూడండి.. వీళ్ల కేరింతలు చూడండి. వాళ్ల మొఖాల్లో చిరునవ్వులు, ఉత్సాహం చూడండి.

Battery Train In Nirmal District Bhainsa Vedam School
Battery Train in Nirmal vedam school : రైలు బండి అక్కడ రైలు బడిలా మారిపోయింది. స్కూలు పిల్లల్ని ఎక్కించుకుని ఊరంతా తిప్పి చూపిస్తోంది. బడి పేరెత్తితేనే గందరగోళం సృష్టించే పిల్లలు..ఇప్పుడు బడికి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బడి పేరెత్తితే చాలు ఎగిరి గంతేస్తున్నారు. దీన్నంతటికీ ఆ రైలు బండే కారణం ! ఇంతకీ బడికి రైలు బండిని ఎలా తీసుకొచ్చారు. పట్టాలతో సంబంధం లేకుండా ఆ రైలు బండి రోడ్లపై ఎలా దూసుకుపోతోంది ? చూసేద్దాం రండి…!
స్కూల్ పిల్లలు చుక్ చుక్ బండి అంటూ రైలు ఆట ఆడుకుంటుంటారు. అటువంటిది రైలు స్కూల్ కే వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలాఉంటుంది. ఇదిగో ఇక్కడ టాయ్‌ట్రైన్‌లో పిల్లల హడావుడి చూడండి.. వీళ్ల కేరింతలు చూడండి. వాళ్ల మొఖాల్లో చిరునవ్వులు, ఉత్సాహం చూడండి. ఇలా రైలుబండిలో షికారుకు తీసుకెళ్తామంటే స్కూలుకు వెళ్లనని మారాం చేసే పిల్లలు ఎవరుంటారు ! ఎప్పుడెప్పుడు స్కూలుకు పోదామా ! ఎప్పుడెప్పుడు రైలుబండిలో ఊరంతా చుట్టొద్దామా ! అని పిల్లలు ఎదురుచూస్తుంటారు. అలా పిల్లలకు స్కూలు పట్ల మక్కువ పెంచడానికే ఇలా వినూత్నంగా ఆలోచించారు. రైలు బండినే రైలుబడిలా మార్చేశారు. ఇదే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. పిల్లలందరిని స్కూలుకు పరుగులు పెట్టేలా చేస్తోంది. పిల్లల తల్లిదండ్రులు కూడా మెచ్చుకునేలా చేసింది.
ఇది నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వేదం పాఠశాల. విద్యార్థులను ఆకర్షించేందుకు ఈ పాఠశాల యాజమాన్యం కొంచెం కొత్తగా ఆలోచించింది. పిల్లల కోసం ప్రత్యేకంగా టాయ్ ట్రైన్‌ను తయారు చేయించింది. అచ్చం రైలులా కనిపించే ఈ వాహనానికి ముందు ఇంజిన్, వెనుక 3 బోగీలు ఏర్పాటు చేశారు. విద్యార్థులను స్కూల్ ఆవరణలో గేట్ దగ్గర నుండి తరగతి గదుల వద్దకు ఈ రైలే తీసుకెళ్తుంది. అంతేకాదు డ్రిల్ పరేడ్ టైమ్‌లో స్కూలు చుట్టూ ఉన్న వీధుల్లో అలా ఓ రౌండ్ వేసి వస్తుంది. కూత పెట్టని రైలు రైరై మంటూ భైంసాలో దూసుకుపోతోంది. ఈ రైల్లో విద్యార్థులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. రైలు బండిలో విద్యార్థులను పట్టణంలోని పలు ప్రాంతాలను తిప్పి చూపించడంతో చిన్నారులు తెగ సంబర పడుతున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు చదువుతోపాటు ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ ట్రైన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
స్కూలు యాజమాన్యం ఈ రైలును రాజస్థాన్‌లో ప్రత్యేకంగా తయారు చేయించింది. దీనికోసం 11 లక్షలు ఖర్చు చేసింది. దీనికి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. ఇది బ్యాటరీతోనే నడుస్తుంది.
ఈ విధంగా కాలుష్య నివారణపైనా పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో విద్యార్థులకు లెసన్స్ అర్థమయ్యేలా ఆడియో, వీడియోలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది 20 కిలోమీటర్ల స్పీడ్‌తో రోడ్డుపై రైరై మంటూ దూసుకుపోతుంది.
స్కూల్లో సీరియస్‌గా లెసన్స్ చెబితే చిన్న పిల్లలకు అంత త్వరగా ఎక్కదు. వారికి అర్థమయ్యే భాషలోనే విజ్ఞానం పంచాలి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు బొమ్మలతోనే పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడే వాళ్లు త్వరగా నేర్చుకుంటారు. ఇప్పుడు వేదం పాఠశాల యాజమాన్యం కూడా అదే చేస్తోంది. కాకపోతే బొమ్మ రైలుతో కాదు.. ఏకంగా రోడ్డుపై రయ్ మంటూ దూసుకుపోయే రైల్లో పిల్లల్ని కూర్చోబెట్టి అన్ని విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. మొత్తానికి ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం చేసిన ప్రయోగం ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మెచ్చుకునేలా చేసింది.