తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు.. నియామక పత్రం అందజేసిన శోభా కరంద్లాజే

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు.. నియామక పత్రం అందజేసిన శోభా కరంద్లాజే

Telangana BJP President Ram ChandraRao,

Updated On : July 1, 2025 / 1:55 PM IST

BJP President Ram ChandraRao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికకు సంబంధించిన ధ్రువపత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ఇంఛార్జి, కేంద్రమంత్రి శోభా కరండ్లాజే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు రామచంద్రరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శోభా కరంద్లజే మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని చెప్పేందుకు గర్వపడుతున్నామని అన్నారు.

Also Read: ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను పీవీఎన్ మాధవ్‌కు అప్పగించిన పురంధేశ్వరి

వచ్చే మూడేళ్లు అధ్యక్షుడిగా పనిచేయాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. బీఆర్ఎస్‌పై ప్రజలు నిరాశతో ఉన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై నిరాశతో ఉన్నారు. ప్రతి గ్రామం, మండలం, జిల్లా వెళ్ళాలి. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేయాలని శోభా కరంద్లజే సూచించారు. నరేంద్ర మోడీ లాంటి యుగపురుషుడు దేశానికి ప్రధానిగా ఉన్నారు. దేశానికి మంచి జరగాలని, దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని 18గంటలు పనిచేసే వ్యక్తి మన ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు.


పదకొండేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మోదీకి ఏముంది.. బట్టలు, బ్యాగ్ తప్ప మరేదీ ఆయనకు లేదు. విదేశాల్లో కూడా భారతదేశం పట్ల గౌరవం దక్కుతుంది. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలని ఆమె సూచించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏటీఎం సర్కారులు ఉన్నాయి. అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదు. అదిష్టానంను సంతోష పెట్టడం తప్ప మరే పని చేయడం లేదని విమర్శించారు. 2029లో మరోసారి ప్రధానిగా మోడీని చేసేందుకు కృషి చేయాలి. నలభై ఏళ్ల క్రితం పార్టీలో ఎవరూ ఉండేవారు కాదు. ఆనాటి నుంచి రామచందర్ రావు పార్టీ కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. అనంతరం నూతన అధ్యక్షడిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు.