Telangana Cabinet meeting: కేబినెట్ సమావేశం.. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత?

రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్, రాష్ట్ర ఆర్థికపరిస్థితి అంశాలపై చర్చించనున్నారు.

Telangana Cabinet meeting: కేబినెట్ సమావేశం.. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత?

Telangana Cabinet Meeting On Lockdown

Updated On : June 6, 2021 / 1:54 PM IST

Telangana Lockdown: రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్, రాష్ట్ర ఆర్థికపరిస్థితి అంశాలపై చర్చించనున్నారు. కేబినేట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలంలో సాగునీరు, తదితర సంబంధిత అంశాలపై సమీక్ష జరిగే అవకాశం ఉంది.

వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో.. పంట పెట్టుబడి సాయం రైతుబంధు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా సెకండ్ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో, ఇంకా తీసుకోవాల్సిన చర్యలను చర్చించనున్నారు.

లాక్‌డౌన్ ఎత్తివేయాలా? దశలవారీగా సడలింపులు ఇవ్వాలా? అనే విషయమై కేబినేట్‌లో చర్చించనున్నారు. థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో.. ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంసిద్ధత గురించి చర్చించనున్నారు. రేపటి(7 జూన్ 2021) నుంచి ప్రారంభించాలి అనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్ సెంటర్లను జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అందరూ పాల్గొని ఏకకాలంలో 19సెంటర్లను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని కోరారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.