Telangana : జార్ఖండ్‌‌కు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జార్ఖండ్‌ టూర్‌కు వెళ్లనున్నారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో భేటీ అవుతారు. అనంతరం చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయలో మృతి చెందిన అమర జవాన్ల..

Telangana : జార్ఖండ్‌‌కు సీఎం కేసీఆర్

Cm Kcr

Updated On : March 4, 2022 / 7:26 AM IST

KCR Visit Jharkhand : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జార్ఖండ్‌ టూర్‌కు వెళ్లనున్నారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో భేటీ అవుతారు. అనంతరం చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయలో మృతి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. తలా పది లక్షల చొప్పున చెక్కులను అందజేయనున్నారు సీఎం కేసీఆర్‌. త్వరలో మిగిలిన అమర జవాన్ల కుటుంబాలనూ ఆదుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత, రాజ్యస‌భ స‌భ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నాయ‌కులు రాకేశ్ టికాయ‌త్ కలిశారు. ప్రస్తుతం దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చర్చించారు. భ‌విష్యత్ కార్యాచరణపైనా వారితో మాట్లాడారు సీఎం కేసీఆర్.

Read More : Delhi : ఢిల్లీలో సీఎం కేసీఆర్ ని కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి..అందుకేనా..?

బీజేపీ వ్యతిరేక కూటమికి కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సొంత ప్రభుత్వ వైఖరిని ఇప్పటికే అనేకమార్లు సుబ్రహ్మణ్యస్వామి వ్యతిరేకించారు. ఆయన రాజ్యసభ పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ తరుణంలో స్వామి, కేసీఆర్‌ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక అన్ని రంగాల్లో పోటీ ఉన్నట్లే.. రాజకీయాల్లోనూ పోటీ ఉండాలన్నారు బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో రాజకీయాలపై తాను చర్చించలేదన్నారు.

Read More : KCR: దేశ రాజకీయాల్లోకి కేసీఆర్.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్..!

అయితే పీపుల్స్‌ ఫ్రంట్‌ రావాల్సిన అవసరం ఉందన్నారు టికాయత్. దేశవ్యాప్తంగా వ్యవసాయ పాలసీ, రైతులకు కేసీఆర్‌ ప్రకటించిన ఆర్థిక సాయంపై చర్చించామన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల వివరాలను మార్చి 10 తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు టికాయత్.