Delhi : ఢిల్లీలో సీఎం కేసీఆర్ ని కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి..అందుకేనా..?

తెలంగాణాలో టీఆర్ఎస్-బీజేపీ ఉప్పు నిప్పులా మండిపోతుంటే ఢిల్లీలో మాత్రం సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కలిసారు. వీరిద్దరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Delhi : ఢిల్లీలో సీఎం కేసీఆర్ ని కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి..అందుకేనా..?

Bjp Mp Subramanya Swamy Meeting With Cm Kcr

BJP MP Subramanya Swamy meeting with CM KCR : ఢిల్లీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణాలో టీఆర్ఎస్-బీజేపీ ఉప్పు నిప్పులా మండిపోతుంటే ఢిల్లీలో మాత్రం సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కలిసారు. ఇటు సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అలాగే స్వపార్టీ మీదనే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్రాన్ని అనేక అంశాల్లో వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీగా ఏప్రిల్ 24తో ఎంపీగా సుబ్రమణ్య స్వామి పదవీ కాలం ముగుస్తున్న క్రమంలో కేంద్రాన్ని వ్యతిరేకించే సీఎం కేసీఆర్ తో భేటీ కావటంతో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది.

Also read : CM KCR : సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి.. నేడు కేజ్రీవాల్‌తో భేటీ

బీజేపీకి వ్యతిరేక కూటమికి ఏర్పాటు చేయటానికి పలువరు సీఎంలతో సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్న తరుణంలో ..సుబ్రమణ్యస్వామి కేసీఆర్ తో భేటీ కావటం మరింత ప్రాధాన్యతకు సంతరించుకుంది. భేటీ కేసీఆర్ ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తో పాటు బికేయు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ సహా పలువురు పలువురు జాతీయ నేతలు కలిశారు.ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23 లో ఉన్న కేసీఆర్ నివాసంలో కేసీఆర్ ను వీరు కలిశారు.

బీజేపీ వ్యతిరేక కూటమి కి ఏర్పాట్లు జరుగుతున్న వేళ కేసీఆర్ సుబ్రమణ్య స్వామి సహా జాతీయ నేతలతో సమావేశమైన కేసీఆర్ జాతీయ రాజకీయ అంశాలు, బీజేపీ విధానాలు,ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, రైతు ఉద్యమం లో చనిపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వ పరిహారం అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

పీపుల్స్ ఫ్రంట్ అని సీఎం కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా కేసీఆర్ ఎన్డీయేతరు నాయకులను వరసగా కలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో టచ్ లో ఉన్నారు కేసీఆర్. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Telangana : ఢిల్లీకి సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలపై ఫోకస్

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కలువనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ ని కలిసేందుకు జాతీయ నాయకులు క్యూ కడుతున్నారు. దీంట్లో భాగంగానే గురువారం (ఫిబ్రవరి 3,2022) బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేసీఆర్ ను కలిశారు. తాజా రాజకీయ పరిణామాల గురించి ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం.