Telangana : ఢిల్లీకి సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలపై ఫోకస్

ఢిల్లీ పర్యటనలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఆయన భేటీ కానున్నారని సమాచారం...

Telangana : ఢిల్లీకి సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలపై ఫోకస్

Kcr Delhi

Telangana Chief Minister KCR : సీఎం కేసీఆర్ హస్తిన బాట పట్టనున్నారు. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే నేషనల్ పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ మారిపోయారు. దేశాన్ని బాగు చేసేందుకు తాను జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ముంబైకి వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్… మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ తో సమావేశాలు జరిపారు.

Read More : Bheemla Naik : ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ హాట్ కామెంట్స్, బాక్సాపీస్ వద్ద కక్ష సాధింపులు ఏంటీ ?

దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, బీజేపీకి ఎలా చెక్ పెట్టాలనే దానిపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఆయన భేటీ కానున్నారని సమాచారం. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు తనదైన శైలిలో పావులు కదుపతున్నారాయన. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది. బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటు కోసం గులాబీ బాస్ చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో.. ప్ర‌ముఖ సినీ న‌టుడు, పొలిటిక‌ల్ లీడ‌ర్ ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌నే ప్రచారం జరుగుతోంది. ముంబైలో సీఎం ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్‌తో కేసీఆర్ స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే.

Read More : CM KCR : దేశం దారి తప్పుతోంది.. సెట్ రైట్ చేస్తా – సీఎం కేసీఆర్

అయితే, ఆయ‌న వెంట ప్ర‌కాశ్ రాజ్ కూడా ఉండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ కావ‌డంతో పాటు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేపింది. దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్యేక ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా రాజ‌కీయాలు క‌దులుతున్నాయి. దీని కోసం ఇప్ప‌టికే కాంగ్రెస్ ను కాద‌ని మ‌రో ప్ర‌తిప‌క్ష కూటమిని ఏర్పాటు చేసే దిశ‌గా దీదీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు కేసీఆర్ సైతం బీజేపీకి వ్య‌తిరేకంగా ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌ను ఏకం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. మరి ఆయన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.