CM KCR : సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి.. నేడు కేజ్రీవాల్‌తో భేటీ

ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. విభజన హామీలు-సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

CM KCR : సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి.. నేడు కేజ్రీవాల్‌తో భేటీ

Kcr

CM KCR Delhi Tour  : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. ఆయన ఇవాళ ఉదయం… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీపై పోరాటం, భవిష్యత్ కార్యాచరణ, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత కేసీఆర్, ఆయన సతీమణి ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. అయితే.. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్​చేస్తున్న కేసీఆర్.. ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జాతీయ స్థాయిలో యాక్టివ్​ రోల్​ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్న కేసీఆర్.. అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని చెప్పిన నేపథ్యంలో.. ఇప్పుడు ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల నేతలను ఆయన కలిసే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. విభజన హామీలు-సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Telangana : ఢిల్లీకి సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలపై ఫోకస్

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్.. ట్రిపుల్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. పీపుల్స్‌ ఫ్రంట్‌ పేరుతో బీజేపీ, కాంగ్రెస్‌యేతర శక్తులను కూడగట్టే కార్యాచరణలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యనేతలను కలిసిన కేసీఆర్‌.. ఇప్పుడు తెరవెనక వ్యూహాలకు పదునుపెడుతున్నారు. నేషనల్‌ పాలిటిక్స్‌ను శాసించేలా గ్రౌండ్‌ వర్క్‌ను సిద్ధం చేస్తున్నారు.

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఢిల్లీ వేదికగా బీజేపీ వ్యతిరేక కూటమితో సదస్సును ఏర్పాటు చేసే యోచనలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్​ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో యాక్టివ్​ రోల్​ ప్లే చేసేందుకు కేసీఆర్ కొత్త టీంను రెడీ చేస్తున్నారు.

CM KCR : దేశం దారి తప్పుతోంది.. సెట్ రైట్ చేస్తా – సీఎం కేసీఆర్

బీజేపీ వ్యతిరేక కుటమికి దేవె గౌడ, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ కలిశారు. త్వరలో స్టాలిన్, మమతా బెనర్జీని కేసీఆర్ కలవనున్నారు. రేపు పలువురు జాతీయ నాయకులను కలిసే అవకాశం ఉంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు, రాష్ట్ర పెండింగ్ అంశాల సాధన దిశగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగనుంది.