CM KCR Warangal Tour : ఈ నెల 10న వరంగల్ వెళ్లనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఈ నెల 10న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాప చేయనున్నారు.

CM KCR Warangal Tour : ఈ నెల 10న వరంగల్ వెళ్లనున్న సీఎం కేసీఆర్

Cm Kcr Warangal Tour

Updated On : November 8, 2021 / 3:21 PM IST

CM KCR Warangal Tour :  సీఎం కేసీఆర్ ఈ నెల 10న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాప చేయనున్నారు. వరంగల్, హన్మకొండ జంటనగరాల అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వేట్రాక్ లపై రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, తదితర అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షించనున్నారు.

చదవండి : CM KCR fire: తగ్గేదే లే.. సీఎం కేసీఆర్ ఫైర్!

వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు, వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, టెక్స్‌టైల్‌ పార్క్ పనుల పురోగతి అంశాలను సీఎం సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో రోడ్ల నిర్మాణంపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుకు అందుకు సంబందించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

చదవండి : టచ్ చేసి చూడు బిడ్డా! _ బండిపై కేసీఆర్ సీరియస్ _ CM KCR Fires on Bandi Sanjay