Gandhi Bhavan
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతల నుంచి దరఖాస్తులు భారీగా వచ్చాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
ఇవాళ ఒక్కరోజే 160కి పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. నిన్నటి వరకు మొత్తం కలిపి 140 దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు ఆశావహులు తరలిరావడంతో అక్కడ సందడి కనపడింది.
ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, వి. హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వ్ సీట్లు వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
భువనగిరి టికెట్ కోసం చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, దయాకర్ దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎలక్షన్ కమిటీ కి పంపనుంది టీపీసీసీ. ఫిబ్రవరి రెండో వారంలో పరిశీలించి.. రేసు గుర్రాలను ఎంపిక చేయనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ.
ఖమ్మం ఎంపీ సీటుకు భట్టి విక్రమార్క సతీమణి దరఖాస్తు.. 500 కార్లతో భారీ ర్యాలీ