ఖమ్మం ఎంపీ సీటుకు భట్టి విక్రమార్క సతీమణి దరఖాస్తు.. 500 కార్లతో భారీ ర్యాలీ

ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం 500 కార్లతో ర్యాలీగా తరలివచ్చి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేశారు.

ఖమ్మం ఎంపీ సీటుకు భట్టి విక్రమార్క సతీమణి దరఖాస్తు.. 500 కార్లతో భారీ ర్యాలీ

Telangana Dy CM Bhatti wife Mallu Nandini holds huge rally of 500 cars

Updated On : February 3, 2024 / 3:59 PM IST

Mallu Nandini: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం పార్లమెంట్ సీట్ కోసం దరఖాస్తు సమర్పించారు. తన మద్దతుదారులతో కలిసి అట్టహాసంగా గాంధీ భవన్‌కు వచ్చి స్వయంగా దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఆమె మద్దతుదారులు ఒకసారి దరఖాస్తు సమర్పించారు. ఈరోజు ఆమె స్వయంగా వచ్చి అప్లికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అనుచరులు బ్యాండ్ మేళా, టపాసుల మోతలతో గాంధీ భవన్ వద్ద హంగామా చేశారు. అంతకుముందు దాదాపు 500 కార్ల కాన్వాయ్ తో ఖమ్మం నుంచి ఆమె భారీ ర్యాలీగా తరలివచ్చారు.

Telangana Dy CM Bhatti wife Mallu Nandini holds huge rally of 500 cars

ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భారీ కాన్వాయ్ తో ర్యాలీగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మల్లు నందిని మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యక్ష రాజకీయాలలో వస్తున్నానని, ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. సోనియా, ప్రియాంక పోటీకి దిగినా.. లేక హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తమందరి లక్ష్యమని పునరుద్ఘాటించారు.

Also Read: మార్పు.. మార్పు అంటున్నారు.. మార్పు అంటే ఇదేనా?: హరీశ్ రావు

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ తరపున లోక్‌స‌భకు పోటీ చేయాలకునే వారి కోసం గాంధీభవన్‌లో ఈరోజు వరకు దరఖాస్తులు స్వీకరించారు. 17 ఎంపీ స్థానాలకు ఆశాహుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం పార్లమెంటు సీటు కోసం మల్లు నందితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తదితరులు దరఖాస్తులు సమర్పించారు.