Harish Rao: మార్పు.. మార్పు అంటున్నారు.. మార్పు అంటే ఇదేనా?: హరీశ్ రావు

డిసెంబర్ 9న 4,000 రూపాయలు ఫించను ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

Harish Rao: మార్పు.. మార్పు అంటున్నారు.. మార్పు అంటే ఇదేనా?: హరీశ్ రావు

Harish Rao

Updated On : February 3, 2024 / 2:58 PM IST

మార్పు.. మార్పు.. అంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారని పింఛన్లు సమయానికి ఇవ్వకపోవడమే మార్పా? అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన మాట్లాడుతూ… నిరంతరాయంగా విద్యుత్ సరఫరా లేకపోవడమే మార్పా? అని అడిగారు. ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ రైతుబంధు ఇవ్వకపోవడమే మార్పా అని ప్రశ్నించారు.

కేంద్ర సర్కారు చేతిలో కీలుబొమ్మగా మారడమే మీరు చెప్పినా మార్పా? అని అన్నారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయలేదని గుర్తు చేశారు. డిసెంబర్ 9న 4,000 రూపాయలు ఫించను ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా తాము ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేనని ప్రస్టేషన్ రేవంత్ రెడ్డిలో కనబడుతోందని హరీశ్ రావు అన్నారు. తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని చెప్పుకొచ్చారు.

కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే 6 గ్యారంటీలు అమలు అవుతాయని రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డి తల కిందకు కాళ్లుపైకి పెట్టి తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవరని హరీశ్ చెప్పారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ లేదుని అన్నారు. బీజేపీని ఓడించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకి ఉన్నదని తెలిపారు.

KTR : డిసెంబర్ 9, జనవరి 9 పోయింది.. ఫిబ్రవరి 9 వచ్చింది..! కాంగ్రెసోళ్లు సమాధానం చెప్పాలి?