KTR : డిసెంబర్ 9, జనవరి 9 పోయింది.. ఫిబ్రవరి 9 వచ్చింది..! కాంగ్రెసోళ్లు సమాధానం చెప్పాలి?

70ఏళ్ల వ్యక్తి కేసీఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం స్థాయి మరిచి కేసీఆర్ ను తిడుతున్నారనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR : డిసెంబర్ 9, జనవరి 9 పోయింది.. ఫిబ్రవరి 9 వచ్చింది..! కాంగ్రెసోళ్లు సమాధానం చెప్పాలి?

BRS working president KTR

Updated On : February 3, 2024 / 2:42 PM IST

Telangana Politics : హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టంకట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. కూకట్ పల్లి స్థానంలో గెలిచి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందన్నారు. ఇచ్చిన మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్లలో కరెంట్ పోలేదు.. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ పోతుంది. డిసెంబర్ 9న రైతులు లోన్లు తెచ్చుకోండి అన్నారు.. ఇప్పటిదాకా రుణమాఫీ చేయలేదు. డిసెంబర్ 9, జనవరి 9 పోయింది.. ఫిబ్రవరి 9 కూడా వస్తుంది.. ఇంకా రుణమాఫీ చేయలేదు.. రూ. 500 బోనస్ రైతులకు ఇస్తామని .. ఇంకా ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

70 ఏళ్ల వ్యక్తి కేసీఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం స్థాయి మరిచి కేసీఆర్ ను తిడుతున్నారనంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 17 తరువాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అంటున్నారు.. పదేళ్లు కేంద్రంలో మోదీ మాకు సహకరించకపోయినా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాం. కానీ, రేవంత్ రెడ్డికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గడం మంచిది కాదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రయోజనాలకోసం పోరాడే ఎంపీలు ఉండాలి. డుడు బసవన్న లాగ ఉండే ఎంపీలు అవసరం లేదు.. ఓటర్లు లోక్ సభ ఎన్నికల్లో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Undavalli Arun Kumar : ఏపీ రాజకీయాలపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఆ ఏరియాల్లో వ్యతిరేకత తప్పదట

అంతకుముందు..  మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ ఫొటో షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమీ రాలేదని అన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం ఒక్క మాటా మాట్లాడడం లేదని, సీఎం ఎందుకు భయపడుతున్నారు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు ఫణంగా పెడుతున్నారంటూ విమర్శించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Also Read : BRS Leader Kavitha : గృహలక్ష్మీ పథకం ప్రారంభించడానికి ఆమెను ఏ హోదాలో పిలుస్తారు?