తెలంగాణ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి.

telangana exit poll 2024 results: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ తలపడ్డాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.
కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాలు.. బీజేపీ 8 నుంచి 9 కైవసం చేసుకుంటుందని ఆరా సంస్థ ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాదని తెలిపింది. మెదక్ పార్లమెంట్ స్థానంలో రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది. బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టిపోటీ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం పార్టీ నిలబెట్టుకుందని వెల్లడించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవేళ్ల, మల్కాజగిరి, జహీరాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందని ఆరా సంస్థ అధినేత మస్తాన్ వెల్లడించారు. మహబూబ్ నగర్ లో గట్టిపోటీ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ స్వల్ప ఆధిక్యంతో గెలుస్తారని జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు తలక్రిందులైందన్నారు.
ఇతర సంస్థల ఫలితాలు