Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ

కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారు సీఎం రేవంత్ వెనకాలే సచివాలయానికి వచ్చారు. సచివాలయ సిబ్బంది, ముఖ్యమంత్రి సహా నూతన మంత్రులకు ఘన స్వాగతం పలికారు

Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ తొలి సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఈ సమావేశం జరుగుతోంది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఏఐసీసీ సీనియర్ నాయకులతో సమావేశం ముగించుకుని, అటు నుంచి నేరుగా సీఎం రేవంత్ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి ఆయన తన సొంత కారులోనే వచ్చారు. ఆ కారుకే పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు.

కాగా, కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారు సీఎం రేవంత్ వెనకాలే సచివాలయానికి వచ్చారు. సచివాలయ సిబ్బంది, ముఖ్యమంత్రి సహా నూతన మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. మొదటి కేబినెట్ సమావేశంలో ఏ ఏ అంశాలపై జరగనుందనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల మీదనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.