LRS: ఎల్ఆర్‌ఎస్‌కు అప్లయ్ చేశారా.. మీకో గుడ్‌న్యూస్
ప్రభుత్వం తాజాగా నిర్ణయం ప్రకారం.. ప్లాట్లు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తుదారుడు ఫుల్ అమౌంట్ చెల్లించడమా లేదంటే కేవలం..

LRS Scheme
Telangana LRS Scheme: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్‌ఎస్)కు అప్లయ్ చేశారా..? అయితే, మీకు గుడ్ న్యూస్. ఎల్ఆర్ఎస్ చార్జీల చెల్లింపులో దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించింది. ప్లాట్లు, లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం రెగ్యులరైజేషన్ ఛార్జీలు, 14శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి రెగ్యులరైజేషన్ ఛార్జీల వరకు చెల్లించినా ప్రొసీడింగ్స్ ఇచ్చే వీలును ప్రభుత్వం కల్పించింది. దీనిద్వారా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెసులుబాట కలగనుంది.
ప్రభుత్వం తాజాగా నిర్ణయం ప్రకారం.. ప్లాట్లు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తుదారుడు ఫుల్ అమౌంట్ చెల్లించడమా లేదంటే కేవలం రెగ్యులరైజేషన్ ఛార్జీల వరకే చెల్లించడమా అనేది నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం పోర్టల్ లో ఆప్షన్స్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు ఇప్పటికిప్పుడు కొంతమేర ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరటనివ్వనుంది.
ప్రస్తుతం కేవలం రెగ్యులరైజేషన్ చార్జీలు చెల్లించినా సరిపోతుంది. అయితే, మిగిలిన 14శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు ఇప్పుడు చెల్లించకపోయినా బిల్డింగ్ నిర్మాణ సమయంలో మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడైతే 2020కి ముందు నాటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ప్రభుత్వం ఓపెన్ స్పేస్ ఛార్జీలను విధించిందని, కానీ, భవిష్యత్ లో బిల్డింగ్ నిర్మాణ సమయంలో అమలయ్యే మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, భవిష్యత్ లో ఆ మొత్తం చాలా పెరిగే అవకాశం ఉందని, చెల్లింపు ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Also Read: Gold Rate: పసిడి దూకుడు.. హైదరాబాద్‌లో రూ.90వేలు దాటిన గోల్డ్ రేటు.. కారణం ఏమిటంటే?
ఇదిలాఉంటే.. ఎల్ఆర్ఎస్ కు అప్లయ్ చేసే సమయంలో కొందరు తమ పేర్లు, ఇంటి పేర్లు, రెవెన్యూ విలేజీ పేర్లు, ప్లాట్ నంబర్, సర్వే నంబర్లను తప్పుగా ఎంట్రీ చేశారు. ఇలాంటివారు ఎల్ఆర్ఎస్ పోర్టల్ లో తమ రిజిష్టర్డ్ ఫోన్ నంబర్ తో లాగిన్ అయ్యి గ్రీవెన్స్ రైజ్ అనే ఆప్షన్ లోకి వెళ్లి తమ సమస్యపై దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోని ఎల్-1 అధికారులు ఈ దరఖాస్తును, ప్రూఫ్ గా అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి సరిచేస్తారు.
మరోవైపు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునే సమయంలో కొందరు తమ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయలేదు. అలాంటి వారికి ఫీజు ఇంటిమేషన్ లెటర్లు రాలేదు. వారుకూడా తమ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు ఇప్పుడు అప్ లోడ్ చేసుకునే ఆప్షన్ పోర్టల్ లో అందుబాటులో ఉంది.