New Ration cards: కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త..

కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. కొత్త కార్డుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

New Ration cards: కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త..

New Ration Cards

Updated On : March 14, 2025 / 10:18 AM IST

New Ration cards: కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. కొత్త కార్డుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రేషన్ కార్డుల వ్యవస్థలో మార్పులు రానున్నాయని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని చెప్పారు. అయితే, రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Also Read: CM Revanth Reddy : తెలంగాణలో సీఎం మార్పు లేదు.. గాంధీ కుటుంబంతో నాకున్న అనుబంధం వేరే లెవల్ : సీఎం రేవంత్ రెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.8కోట్ల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని స్పష్టం చేశారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ట్రైకలర్ లో బీపీఎల్ కార్డులు, గ్రీన్ కలర్ లో ఏపీఎల్ కార్డులు పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.

Also Read: Gossip Garage : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అందుకే సీరియస్ అయ్యారా?

కొత్తవారితోపాటు ఇప్పటికే కార్డులున్న వారికిసైతం స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని, అయితే, కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచామని, ఈ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుందని, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గతంలో రేషన్ కార్డులు ఉన్న వారిలో పింక్ కార్డులు ఉన్న వారికి గ్రీన్ కార్డులు, తెల్లకార్డు ఉన్న వారికి ట్రైకలర్ కార్డులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో కొత్త, పాత రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను అందజేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. 25వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20లక్షల చొప్పున మొత్తం 1.20 కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.