CM Revanth Reddy : తెలంగాణలో సీఎం మార్పు లేదు.. గాంధీ కుటుంబంతో నాకున్న అనుబంధం వేరే లెవల్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణలో సీఎం మార్పునకు సంబంధించి వస్తున్న వార్తలను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సీఎం మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణలో సీఎం మార్పునకు సంబంధించి వస్తున్న వార్తలను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. గాంధీ కుటుంబంతో నాకున్న అనుబంధం వేరే లెవల్ అంటూ స్పష్టం చేశారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం (మార్చి 13న) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారతారన్న ప్రశ్నకి స్పందిస్తూ.. తెలంగాణలో సీఎం మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో ఏదైనా సాధించుకునే సత్తా తనకు ఉందన్నారు. తాను ఎవరి ట్రాప్‌లో పడనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రచారంలో వాస్తవం లేదని సీఎం రేవంత్ కొట్టిపారేశారు. ప్రభుత్వం, పార్టీపై తనకు పూర్తి పట్టు ఉందని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రంగా ఖండన :
గాంధీ ఫ్యామిలీకి రేవంత్ రెడ్డి మధ్య చాలా గ్యాప్ పెరిగిందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గాంధీ ఫ్యామిలీతో దూరం పెరగడం వల్లే ఆయనకు అధిష్టానం కనీసం అపాయిట్మెంట్ ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి.
సీఎం రేవంత్ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. అధిష్టానాన్ని కలిసినట్టుగా ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. నేను ఎవరో తెలియకుండానే పార్టీ పీసీసీ చీఫ్, సీఎంను చేశారా? అంటూ సూటిగా సీఎం రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉందని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ కోరారు.
Read Also : Telangana Assembly: స్పీకర్ పై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు.. హరీశ్ రావు కీలక కామెంట్స్