సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు అనుమతి

  • Published By: bheemraj ,Published On : July 27, 2020 / 06:05 PM IST
సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు అనుమతి

Updated On : July 27, 2020 / 6:30 PM IST

తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కు మీడియాకు అనుమతిస్తున్నట్లు హైకోర్టుకు తెలపనుంది. సాయంత్రం 4 గంటలకు సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులను ప్రభుత్వం అనుమతించింది. సచివాలయం వద్దకు మీడియా ప్రతినిధులను తీసుకెళ్లింది. సచివాలయ భవాల కూల్చివేత కవరేజ్ కు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడంతో సీపీ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో మీడియా ప్రతినిధులను అక్కడికి తీసుకెళ్లారు.

ఇప్పటికే 90 శాతానికి పైగా సచివాలయం భవనాల కూల్చివేతలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. సీపీ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో సిటీ పోలీసులు, ఐఎమ్ పీఆర్ రెండు డిపార్ట్ మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకతను మెయిటెయిన్ చేసే విధంగా భవనాలు ఎంతమేరకు కూలిపోయాయి.. పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోనున్నారు.

ఈ నెల 7 వ తేదీన సచివాలయ భవనాలు కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సెక్రటేరియట్ కూల్చివేతను వ్యతిరేకించాయి. కూల్చివేత వ్యవహారం గోప్యంగా జరుగుతుందని, లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రజలకు కావాల్సిన సమాచారం ఇవ్వడం లేదు. కవరేజ్ కు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా చూస్తున్నారని ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు చేస్తున్న నేపథ్యంలో ఇదే అంశంపై కొంతమంది హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వం దీనికి స్పందించి సెక్రటేరియట్ భవనాలను ఎలా కూల్చివేశారు.

అదే విధంగా కూల్చివేసిన సందర్భంలో వ్యర్థాలను ఎలా తొలగిస్తున్నారన్న అంశాలను మీడియా బృందానికి తెలియజేసిందుకు అదే విధంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు మీడియా ప్రతినిధులను అక్కడకు తీసుకెళ్లారు. ఇప్పటికే 90 శాతం కూల్చివేత పనులు పూర్తి అయ్యాయి. 4500 లారీల లోడ్లు అవుతాయని అంచనా. ఇప్పటికే 2వేల లోడ్లు తరలించారు. 50 శాతం శిథిలాలు ఉన్నాయి.. మిలిగిన పది శాతం కూల్చివేతలు పూర్తి అయితే అది కూడా తొలగిపోతాయి.