Telangana Govt : తెలంగాణలో యూనివర్సిటీ ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్‌.. రిటైర్మెంట్ వయస్సు పెంపు.. ఎంతంటే?

Telangana Govt : తెలంగాణలో యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 60ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

Telangana Govt : తెలంగాణలో యూనివర్సిటీ ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్‌.. రిటైర్మెంట్ వయస్సు పెంపు.. ఎంతంటే?

Telangana govt Increased retirement age

Updated On : January 30, 2025 / 11:14 PM IST

Telangana Govt : తెలంగాణలోని యూనివర్సిటీ ప్రొఫెసర్లకు శుభవార్త.. ప్రొఫెసర్ల పదవి విరమణ వయస్సకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 60ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. దాంతో 60 ఏళ్లు దాటిన యూనివర్సిటీ ప్రొఫెసర్లు మరో ఐదేళ్లపాటు విధుల్లో కొనసాగనున్నారు.

Read Also : India AI model : డీప్‌సీక్, చాట్‌జీపీటీకి పోటీగా ఏఐ రేసులో భారత్.. ఎప్పుడు? ఎలా? ఫుల్ డిటెయిల్స్..

ఈ ప్రొఫెసర్లకు మాత్రమే వర్తింపు :
రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో అధ్యాపకుల రిటైర్మెంట్ వయసును 60ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ కొత్త నిబంధన యూజీసీ (UGC) వేతన స్కేల్ పొందే యూనివర్శిటీ ప్రొఫెసర్లకు మాత్రమే వర్తించనుంది.

అలాగే, సాధారణ రాష్ట్ర ప్రభుత్వ వేతన స్కేలులోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఇందుకు అర్హులు కారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 వర్సిటీలున్నాయి.

73శాతం ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ :

అందులో మొత్తం 2,800కి పైగా ప్రొఫెసర్ పోస్టులు ఉండగా, కేవలం 757 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో 2,060 పైగా పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. దాదాపు 73శాతం ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట. ఈ ఖాళీలను అత్యంత త్వరగా భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read Also : Budget 2025 : పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్ న్యూస్.. కొత్త పన్ను విధానంలో ఈ 5 ముఖ్యమైన మినహాయింపులు ఉండవు.. తప్పక తెలుసుకోండి!

ప్రతి నెలా జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఒక్కొక్కరుగా పదవీ విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఎడ్యుకేషన్ సెక్షన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. దాంతో వీరే అన్ని వర్సిటీలకు డీన్లుగానూ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్లుగా వ్యవహరించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును పెంచుతూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.