Minister Harish Rao : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణకు అడుగులు : మంత్రి హరీశ్ రావు

బస్తీల ప్రజల సుస్తి నయం చేయడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు. మానవతా మూర్తి కేసీఆర్ వల్ల ఇటువంటి దవాఖానాలు ఏర్పాటయ్యాయి. గర్భిణులకు వరంగా న్యూట్రిషన్ కిట్ మారింది. పుట్టబోయే బిడ్డలు బలంగా ఉండాలన్నదే మా ప్రభుత్వం ఆలోచన.

Minister Harish Rao : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణకు అడుగులు : మంత్రి హరీశ్ రావు

minister harish rao

TS Minister Harish Rao : హైదరాబాద్‌లోని నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా  ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు నిమ్స్ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యయనం అనీ..కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణకు అడుగులు పడుతున్నాయన్నారు. పెరుగుతున్న ప్రజల వైద్య సదుపాయాల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికు శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో ఉన్నాయని.. ఇటువంటి వైద్య సదుపాయాలు అందించే హైదరాబాద్ హెల్త్ హబ్ గా మారుతుందన్నారు.

Shejal : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. ఢిల్లీలో శేజల్ వినూత్న నిరసన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్

పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా బస్తీల ప్రజల సుస్తి నయం చేయడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసుకున్నామని మానవతా మూర్తి కేసీఆర్ వల్ల ఇటువంటి దవాఖానాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, 33 మెడికల్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కేసీఆర్ ఆలోచన అనీ..కేసీఆర్ ఒక తల్లిగా ఆలోచించి తీసుకువచ్చినదే ఈ నుట్రిష న్ కిట్ అన్నారు.గర్భిణులకు వరంగా న్యూట్రిషన్ కిట్ మారిందని..పుట్టబోయే బిడ్డలు బలంగా ఉండాలన్నదే ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందన్నారు.

Income Tax Raids : తెలంగాణలో ఐటీ దాడుల కలకలం.. బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు

కడుపులో బిడ్డకు న్యూట్రిషన్ కిట్..ప్రసవం తరువాత కేసీఆర్ కిట్ అని తెలిపారు.కేసీఆర్ ది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే ప్రతిపక్షాలది పార్టిషన్ పాలిటిక్స్ అంటూ సెటైర్లు వేశారు. పభుత్వానివి కిట్లు.. ప్రతిపక్షాల వి తిట్లు అంటూ ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయతో ఫ్లోరైడ్ ను తగ్గించుకున్నామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో సీజనల్ వ్యాధుల్ని తగ్గేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేసీఆర్ నంబర్ వన్ కావడంతో… ప్రతి రంగంలో తెలంగాణ నంబర్ వన్.. నిలిచిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

కొత్త ఆస్పత్రి భవనం ప్రత్యేకతలు..
రూ.1571 కోట్లతో కొత్త ఆస్పత్రి భవనం నిర్మాణం
కొత్త ఆస్పత్రిలో 4 బ్లాకులు, 38 విభాగాలు
32 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు
120 ఓపీ గదులు, 1200 ఆక్సిజన్ బెడ్స్,500 ఐసీయూ పడకలు