High Court : మంత్రి కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ 2018లో కాంగ్రెస్ నేత లక్ష్మణ్(Lakshman) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో రీకౌంటింగ్ జరిపించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

High Court : మంత్రి కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

High Court dismiss petition

Updated On : August 1, 2023 / 4:45 PM IST

Telangana High Court : తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar)కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కొప్పుల ఈశ్వర్ కు కోర్టు షాక్ ఇచ్చింది. కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ధర్మపురిలో(Dharmapuri) ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని హైకోర్టులో కొప్పుల ఈశ్వర్ పిటిషన్ వేశారు. అయితే కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ 2018లో కాంగ్రెస్ నేత లక్ష్మణ్(Lakshman) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో రీకౌంటింగ్ జరిపించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో లక్ష్మణ్ పిటిషన్ ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టి వేసింది.

TS High Court : హైకోర్టులో పెండింగ్ లో ఉన్న 30 మంది ఎంఎల్ఏల ఎలక్షన్ పిటిషన్లు.. వీటిలో 25కి పైగా అధికార పార్టీ ఎంఎల్ఏలవే

అయితే మూడు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు పిటిషన్ పై విచారణ ఆపలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. కొప్పుల ఈశ్వర్ ఎన్నికపై దాఖలైన ఎన్నికల పిటిషన్ పై బుధవారం విచారణ జరుగనుంది. ఎన్నికల పిటిషన్ పై వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ ముందు కొప్పుల, అడ్లురి వాంగ్మూలం వినిపించారు.

మరో మంత్రి గంగుల కమలాకర్ పై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. గంగుల కమలాకర్ పై దాఖలైన ఎలక్షన్ పిటిషన్ లోనూ హైకోర్టు రిటైర్డ్ జడ్జి శైలజతో కమిషన్ ను నియమించింది. ఆగస్టు 12 నుండి 17తేదీ వరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.