కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ.. మూడు వారాలకు వాయిదా..
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

Telangana High Court
Telangana High Court: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వాదనల సందర్భంగా టీజీఐఐసీకి భూమిని అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో హైకోర్టు మూడు వారాలకు విచారణను వాయిదా వేసింది.
కంచ గచ్చిబౌలి భూములను రాష్ట్ర ప్రభుత్వం గతంలో టీజీఐఐసీకి కేటాయించిన విషయం తెలిసింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ క్రమంలో భూములను జేసీబీలతో చదును చేసింది. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వేర్వేరుగా నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ వాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను జీసే ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో గత నెలలో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తదుపరి విచారణను జులై 23వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.