Kamareddy master plan TS HC : కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

తెలంగాణలోని కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు పుట్టిస్తోంది. రైతులంతా మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Kamareddy master plan TS HC : కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

High Court refused to grant a stay on the Kamareddy Master Plan

Updated On : January 11, 2023 / 12:57 PM IST

Kamareddy master plan TS HC :  తెలంగాణలోని కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు పుట్టిస్తోంది. రైతులంతా మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. టౌన్‌ప్లానింగ్‌ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీకాదు అంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం హైదరాబాద్‌, వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని అభిప్రాయపడింది. దీనిపై అభ్యంతరాలు తీసుకుంటున్నామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

కాగా కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ తీవ్ర వివాదాన్ని రేపింది. రైతులు వందలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఏడు గ్రామాలకు చెందిన వేలాదిమంది రైతలు ధర్నాలు చేపట్టి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనలు చేశారు. తమ భూముల గురించి తమను సంప్రదించకుండా పంట భూములను రిక్రియషన్ జోన్ గా ప్రభుత్వం ప్రతిపాదించటాన్ని సవాల్ చేస్తో హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్ లను ప్రతివాదులగా చేర్చారు.