High Court: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. నియామకాలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

అలాగే, ప్రశ్నల తప్పిదాలపై స్వతంత్ర నిపుణుల కమిటీ పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు..

High Court: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. నియామకాలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

TS High Court

కానిస్టేబుళ్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ కానిస్టేబుళ్ల నియామకాలపై ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో, 15,640 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రశ్నపత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై.. సెలక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపారు. ఆ తీర్పును సవాలు చేశారు.

దీంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అలాగే, ప్రశ్నల తప్పిదాలపై స్వతంత్ర నిపుణుల కమిటీ పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MLC bypoll: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల