Murder : టీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త హత్య
తెలంగాణాలోని జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎంపీటీ భర్త రాజారెడ్డి హత్యకు గురయ్యారు.ఇబ్రహీంపట్నం మండలంలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ ఎంపీటీసీ భర్త పడల 42 ఏళ్ల రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.

Mptc Hus Murder
Ibrahimpatnam MPTC husband murder : తెలంగాణాలోని జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎంపీటీ భర్త రాజారెడ్డి హత్యకు గురయ్యారు.ఇబ్రహీంపట్నం మండలంలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ ఎంపీటీసీ భర్త పడల 42 ఏళ్ల రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డిని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి హత్య చేశాడు. రాజారెడ్డి, రమేశ్ అనే వ్యక్తితో కలిసి నిన్న రాత్రి మద్యం సేవించగా..ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి అది గొడవగా మారింది. మద్యం మత్తులో ఉన్న రమేశ్ క్షణికావేశంలో రాజారెడ్డిని పారతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో రాజారెడ్డి దెబ్బలు తాళలేక తీవ్ర గాయాలై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప్రతికి కి తరలించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓశుభకార్యానికి హాజరైన క్రమంలో మద్యం తాగిన మత్తులో ఇద్దరి మధ్యా జరిగిన ఈ గొడవకాస్తా ఘర్షణకు దారి తీసి హత్యకు కారణమైనట్లుగా తెలుస్తోంది.