Inter Result 2025: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల ఆరోజే.. ఏర్పాట్లు చేస్తున్న ఇంటర్ బోర్డు
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ఆరోజు ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Inter Result 2025
Inter Result 2025: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. దీంతో తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయనే అంశంపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Also Read: Telangana Govt: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.10వేలు
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు 1,532 కేంద్రాల్లో జరిగాయి. ప్రథమ, ద్వితీయ పరీక్షల్లో మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,80,415 మంది మొదటి సంవత్సరం విద్యార్థులుకాగా.. 4,44,697 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థులు రాసిన సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ గత నెల 18 నుంచి ప్రారంభమైంది. 19కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాకనం జరుగుతుంది. మొత్తం 60లక్షల పేపర్లు మూల్యాంకనం చేసి ఆన్ లైన్ లో మార్కులు ఫీడ్ చేశారు. వీటిని రెండు సార్లు పరిశీలించిన తరువాత తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీతో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఈనెల 25 లేదా 27తేదీల్లో విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డ్ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వీలుంటే అంతకముంటే ముందే ఫలితాలు వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.