Telangana Govt: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.10వేలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.

Telangana Govt: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.10వేలు

CM Revanth Reddy

Updated On : April 12, 2025 / 9:25 AM IST

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 20వేల ఎకరాలకు రూ.10వేల చొప్పున నష్ట పరిహారం పంపిణీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.20కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేసింది.

Also Read: Weather Update: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..

రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్ని పంటలుసాగు చేస్తున్నారు. అయితే, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీంతో భారీగా నష్టపోతున్న పరిస్థితి. ఈ ఏడాది కూడా అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా చేతికొచ్చిన పంటలను రైతులు నష్టపోయారు. దీంతో పంట నష్టపోయిన రైతులను కొంతమేరైనా ఆదుకొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

Also Read: Vijayashanti: ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు.. నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ..

ఈ యాసంగి సీజన్ లో అకాల వర్షాలతో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతుల వారీగా నివేదిక అందింది. అయితే, ఈ నెల మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు మరింత పంట నష్టం చోటుచేసుకుంది. దాదాపు 14,956 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం రాగా.. రైతుల వారీగా సర్వే చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ సర్వే పూర్తయితే మొత్తం ఎన్ని ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందనే విషయంపై స్పష్టత రానుంది. మొత్తం 20వేల ఎకరాల్లో పంట నష్టపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

AP Inter Results 2025

రాష్ట్ర బడ్జెట్ నుంచే నష్ట పరిహారం సొమ్ము ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. పంటల బీమాకు సంబంధించిన కేంద్ర పథకం ఫసల్ బీమా యోజన తెలంగాణలో ఇంకా అమల్లోకి రాలేదు. అయితే, రేవంత్ సర్కార్ తాజా నిర్ణయంతో కొంతమేర అయిన మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.