Weather Update: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.

Weather Update: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..

Telangana Rain alert

Updated On : April 12, 2025 / 8:11 AM IST

Weather Update: తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Also Read: త్వరలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ నియామకాలు: మంత్రి దామోదర

వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. దక్షిణ భారతదేశంలో విస్తారమైన మేఘాలు కేంద్రీకృతమయ్యాయి. ఈ మేఘాలు తూర్పు దిక్కుగా కదులుతూ తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా వస్తున్నాయి. మరోవైపు ఆగ్నేయ ఆసియా ప్రాంతం నుంచి కూడా మేఘాలు రావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

 

ఇవాళ (శనివారం) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

AP Inter Results 2025

మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ణ స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి సమయానికి వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉందని, రాబోయే మూడు రోజులు పాటు తెలంగాణలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: Gold Price: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి..