Telangana Inter: మార్చి 15 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతాయి.

Telangana Inter: మార్చి 15 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

Tenth Exams

Updated On : December 19, 2022 / 6:47 PM IST

Telangana Inter: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఆదివారం రోజుల్లో కూడా ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. రెండు సెషన్స్ లో ఈ పరీక్షలు జరుగుతాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. పర్యావరణ విద్య పరీక్ష మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.

కాగా, ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం అవుతాయి. రెండో సంవత్సర పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహిస్తారు. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 3న ముగుస్తాయి. రెండో సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు అన్నీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.

Lok Sabha: మనం మన జవాన్లను కించపర్చకూడదు: రాహుల్ గాంధీకి లోక్‌సభలో జైశంకర్ కౌంటర్