వావ్.. మీ పిల్లల హెల్త్ ఈ యాప్ లో.. తెలంగాణలో కొత్త స్కీమ్..
పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలతో పాటు పెరుగుదలలో వచ్చే ఆరోగ్య సమస్యలను గుర్తించి ఈ సమచారాన్ని యాప్‌లో సేవ్ చేస్తారు.
Bala Bharosa Scheme: తెలంగాణలో ఐదేళ్లలోపు పిల్లల హెల్త్ కోసం తెలంగాణ ప్రభుత్వం బాల భరోసా పథకంలో భాగంగా ఓ యాప్‌ను తీసుకొచ్చింది. పిల్లల ఆరోగ్య వివరాలు అన్నీ ఈ యాప్‌లోనే ఉంటాయి. ఈ ప్రక్రియను వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ చేపడుతున్నాయి.
పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలతో పాటు పెరుగుదలలో వచ్చే ఆరోగ్య సమస్యలను గుర్తించి ఈ సమాచారాన్ని యాప్‌లో సేవ్ చేస్తారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు సర్వే చేశారు.
ఇందులో భాగంగా దాదాపు 18 లక్షల మంది పిల్లలను పరీక్షించారు. 8 లక్షల మంది ఏదో ఒక లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. సమస్యలు ఉన్న ఈ 8 లక్షల మంది పిల్లలను రాష్ట్రీయ బాల స్వాస్థ్య ప్రోగ్రాం వైద్య అధికారులు పరీక్షించి వారికి నిజంగానే సమస్యలు ఉన్నాయా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు.
Also Read: Severe Cold Wave: 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. చలి భరించాల్సిందే..
ఇందులో భాగంగా వికారాబాద్‌లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అంగన్‌వాడీలు గుర్తించిన పిల్లల్లో చాలామందికి ఎటువంటి సమస్యలూ లేవని వైద్యుల పరీక్షల్లో తేలింది. కొందరు పిల్లల్లో మాటలు సరిగ్గా రాకపోవడంతో పాటు వినికిడి సమస్యలను వైద్యులు గుర్తించారు. వైద్యుల స్క్రీనింగ్ ముగిసిన తర్వాత యాప్‌లో ఆయా పిల్లల వివరాలను నమోదు చేస్తున్నారు.
వారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తే పర్యవేక్షణ ఈజీ అవుతుంది. వారికి అందుతున్న ట్రీట్‌మెంట్‌తో పాటు వారి ఆరోగ్య స్థితి ఎలా ఉందనే విషయంపై అధికారులందరికీ ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తాయి. పిల్లల్లో సమస్యలను సరైన సమయంలో గుర్తిస్తే వ్యాధులు నయమవుతాయి. పిల్లలకు వైద్య పరీక్షలు చేయించి, అవసరమైన వారికి పూర్తిగా ఉచితంగా చికిత్స అందించడమే బాల భరోసా లక్ష్యం.
