Born Baby Girl: ఆడపిల్ల పుట్టిందని ఊరంతా కూరగాయలు పంచిన తండ్రి
ఈరోజుల్లో ఆడపిల్ల పుడితే ‘మా ఇంట్లో మహాలక్ష్మి’ పుట్టిందని పండుగ చేసుకునేవారు గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు ఏంటీ ఆడపిల్లా? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందని మురిసిపోయాడు.

Telangana Man Who Distributed
Dad Distributed vegetables: ఈరోజుల్లో ఆడపిల్ల పుడితే ‘మా ఇంట్లో మహాలక్ష్మి’ పుట్టిందని పండుగ చేసుకునేవారు గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు ఏంటీ ఆడపిల్లా? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందని మురిసిపోయాడు. ఆ ఆనందాన్ని తన గ్రామాస్తులతో పంచుకున్నారు. తనకు కూతురు పుట్టిందన్న సంతోషంలో తన గ్రామంలో ప్రతీ ఇంటికి తిరగి నాలుగు రోజులకు సరిపడా కూరగాయాలు పంచాడు. ఈకరోనా కాలంలో కూరగాయల ధరలు ఎంతగా పెరిగిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈక్రమంలో నాలుగు రోజులకు సరిపడా రకరకాల కూరగాయలను పంచి తనకు కూతురు పుట్టిందని చెప్పుకుని మురిసిపోయాడు తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన తండ్రి..
సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఖానాపూర్ లో మరబోయిన నవీన్‌కు శనివారం (మే 29,2021)ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టిందని నవీన్ తెగ సంబరపడిపోయాడు. తన సంబరాన్ని గ్రామస్తులతో పంచుకోవాలనుకున్నాడు. అంతే వ్యాన్ నిండా రకరకాల కూరగాయలు తెప్పించాడు. గ్రామంలో 300 ఇండ్లకు నాలుగైదు రోజులకు సరిపడేలా పంచాడు. ఎందుకిలా చేస్తున్నావని అడుగగా ‘మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందన్నా..అందుకే ఈ సంబరం’’అని చెప్పుకొచ్చాడు.అది విన్న గ్రామస్తులు కూడా సంతోషించారు. నీ మహాలక్ష్మి సల్లగా ఉండాలె అంటూ దీవించారు. తనకు కూతురు పుట్టిందని గ్రామంలో అందరికీ చెప్పుకున్నాడు గర్వంగా.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ..ఈ కరోనా సమంలో నాకు కూరుతు పుట్టిన సందర్భంగా తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకున్నానని అందరికీ కూరగాయలు పంచానని తెలిపాడు. కూరగాయలు పంచటానికి తనకు సహకరించిన శివాజి యువసేన యూత్ మిత్ర బృందానికి కృతజ్ఞతలుతెలిపాడు. గ్రామస్తులు కూడా చాలా ఆనందించి నవీన్ ను ప్రశంసించారు. అతని కూతురుని దీవించారు.