Minister Harish Rao : చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి హరీశ్ రావు.. ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువ వరి సాగు

తెలుగుదేశం స్థాపించకముందు తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు తిన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ ప్రశ్నించారు.

Minister Harish Rao : చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి హరీశ్ రావు.. ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువ వరి సాగు

Harish Rao

Updated On : March 5, 2023 / 5:12 PM IST

Minister Harish Rao : తెలుగుదేశం స్థాపించకముందు తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు తిన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో వరి సాగు లెక్కలు తీశానని హరీశ్ రావు చెప్పారు. ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువగా వరి సాగు అవుతుందన్నారు.

తెలంగాణలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని తెలిపారు. ఏపీలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగ అయిందని పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతోందన్నారు.