TS MLC Results Live Updates: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి.

TS MLC Results Live Updates: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

Ts Mlc Results

Updated On : December 14, 2021 / 10:00 AM IST

TS MLC Results :  తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. మధ్యాహ్నం 12 గంటలవరకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

కరీంనగర్‌ జిల్లా ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్‌లో కౌంటింగ్ జరుగుతోంది. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. మహిళా శక్తి సమైఖ్య భవనంలో నిర్వహిస్తున్నారు. నల్గొండతో పాటు.. ఖమ్మం స్థానాలను అధికార పార్టీ టీఆర్ఎస్ దక్కించుకుంది. నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన కోటిరెడ్డి.. 691 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ లోని రెండు స్థానాలను పూర్తిగా టీఆర్ఎస్ దక్కించుకుంది. క్లీన్ స్వీప్ చేసింది.