Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ 30 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు గురువారం(జులై7,202) ఉదయం ఆలయ ఈవో గీతకు ఆయన సతీమణి బోయినపల్లి మాధవి అందజేశారు.

Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం

Yadadri

Updated On : July 7, 2022 / 5:40 PM IST

Yadadri : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి విమాన గోపురానికి స్వర్ణం తాపడానికి బంగారం విరాళాలు అందిస్తూనేవున్నారు. ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు బంగారం విరాళంగా ఇస్తున్నారు.

తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ 30 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు గురువారం(జులై7,202) ఉదయం ఆలయ ఈవో గీతకు ఆయన సతీమణి బోయినపల్లి మాధవి అందజేశారు.

Yadadri RTC Buses : యాదాద్రి కొండపైకి వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

తిరుమల తరహాలో ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీని కోసం 125 కిలోల బంగారం అవసరం అవుతుందని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు బంగారం విరాళంగా అందజేస్తున్నారు.