Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు(Telangana Covid Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30వేల 146 కరోనా పరీక్షలు చేయగా

Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు

Telangana Corona Cases

Updated On : March 4, 2022 / 8:36 PM IST

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30వేల 146 కరోనా పరీక్షలు చేయగా 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. అదే సమయంలో నిన్న ఒక్కరోజే మరో 374 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో ఇంకా 2వేల 164 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,89,553. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,83,278. రాష్ట్రంలో నేటివరకు 3,36,46,433 కరోనా టెస్టులు చేశారు. క్రితం రోజు 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. నిన్న కొత్తగా 86 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇంతవరకు కోవిడ్ సోకినవారి సంఖ్య రాష్ట్రంలో 23,18,262కి చేరింది. అదే సమయంలో 288 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంతవరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,02,192 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించ లేదు.

Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా రెండోరోజు 7 వేల దిగువనే నమోదైన కేసులు.. తాజాగా ఇంకాస్త తగ్గాయి. గురువారం 9 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 6వేల 396 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఒక శాతం దిగువకు చేరిన పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 0.69 శాతానికి క్షీణించింది. 24 గంటల వ్యవధిలో మరో 201 మంది కోవిడ్ తో మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.29 కోట్లు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,14,589 మంది కోవిడ్ తో చనిపోయారు.

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

ఇక నిన్న 13,450 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.23 కోట్లు(98.64 శాతం) దాటాయి. యాక్టివ్ కేసులు 69,897(0.16 శాతం)కి తగ్గిపోయాయి. నిన్న 24,84,412 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటివరకూ 178 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్రం శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.