Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 2,861 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,861 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు..

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 81,486 కరోనా టెస్టులు చేయగా 2,861 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 234, రంగారెడ్డి జిల్లాలో 165, ఖమ్మం జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 4వేల 413 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,63,911 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,22,654 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37వేల 168 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 4,089కి పెరిగింది.

Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

అటు దేశంలోనూ కరోనా ఉధృతి తగ్గింది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2లక్షల 9వేల 918 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2లక్షల 62వేల 628 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 959 మంది చనిపోయారు.

ప్రస్తుతం దేశంలో 18లక్షల 31వేల 268 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ లో తెలిపింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉంది.