Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
రాష్ట్రంలో ఇంకా 417 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు 7లక్షల 93వేల 044 కేసులు నమోదవగా..(Telangana Corona News Report)

Telangana Covid Report
Telangana Corona News Report : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12వేల 971 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 47 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 26 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 18, హనుమకొండ జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 28 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనాతో మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో ఇంకా 417 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. తెలంగాణలో నేటివరకు 7లక్షల 93వేల 044 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7లక్షల 88వేల 516 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 627 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 49మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Corona News Report)
అటు.. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 4.52 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 628 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 24 శాతం మేర అధికంగా కేసులొచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 2వేల 167 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!
కొత్త కేసుల పెరుగుదలతో యాక్టివ్ కేసులు 15వేల 414కు పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో మరో 18 మంది కరోనాతో మరణించారు. దేశంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5.24 లక్షలు.
మహమ్మారి కట్టడికి కేంద్రం ప్రారంభించిన టీకా కార్యక్రమం కింద 192 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 13.13 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. మాస్కులు ధరించడాన్ని కొనసాగించాలని కోరారు. కరోనా వైరస్ మన నుంచి పూర్తిగా పోలేదన్న ఆయన.. ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మాస్క్ ధరించడంతో పాటు అర్హులైన వారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సీఎం కోరారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారిలో 92.27శాతం మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించామన్నారు.
Dogs: కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?
మరోవైపు, మహారాష్ట్రలో మార్చి 5 తర్వాత తొలిసారిగా 470 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క ముంబైలోనే 295 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫిబ్రవరి 12 తర్వాత ముంబయిలో ఇంత భారీగా కేసులు రావడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.59శాతంగా ఉండగా.. వీటిలో ముంబై, పుణెలలో రాష్ట్ర సగటు కన్నా అధికంగా ఉంది. ప్రస్తుతం ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. 18 మంది ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.26.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/8yb9FYs5ze— IPRDepartment (@IPRTelangana) May 26, 2022