Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 614 కరోనా కేసులు, సున్నా మరణాలు

రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 614 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24గంటల వ్యవధిలో 2వేల 387మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9వేల 908 యాక్టివ్ కేసులు..

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఆదివారంతో(429) పోలిస్తే సోమవారం పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 614 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఒక్కరోజులో ఒక్క కరోనా మరణం కూడా లేకపోవడం ఊరటనిచ్చే అంశం.

అదే సమయంలో గత 24గంటల వ్యవధిలో 2వేల 387మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9వేల 908 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 50వేల 520 మందికి కరోనా పరీక్షలు చేశారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 131 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,062 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,70,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా ఉంది.

Jagananna Chedodu Scheme : రూ.10వేలు రాలేదా? మార్చి 11లోపు ఇలా చేయండి…

అటు దేశంలోనూ కరోనా తీవ్రత తగ్గుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌తో పోల్చితే.. థర్డ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. ఇప్పుడు అదే స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. కేవలం మూడు వారాల్లోనే 3 లక్షల స్థాయి నుంచి 30 వేల స్థాయికి కొత్త కేసుల సంఖ్య పడిపోయింది. దీంతో రాష్ట్రాలు సైతం ఆంక్షలు సడలిస్తున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

కొవిడ్‌ తొలి వేవ్‌లో లాక్‌డౌన్‌ పరిస్థితులు, సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత, భారీ మరణాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. మరోసారి ప్రజలను ఆందోళనకు గురిచేసింది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ వేరియంట్‌.. అధిక జనసాంద్రత కలిగిన మన దేశంలో ప్రవేశిస్తే ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ భయాలు కొనసాగుతున్న వేళ డిసెంబర్‌ మొదటి వారంలో ఒమిక్రాన్‌ తొలి కేసు దేశంలో నమోదైంది. అదే నెల చివరి నుంచి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10 వేల స్థాయి నుంచి క్రమంగా పెరగడం మొదలైంది.

Railways Training : పది పాసైతే చాలు.. ఉచిత శిక్షణతోపాటు రైల్వేలో ఉద్యోగం

జనవరి 1 నాటికి 22 వేలుగా రోజువారీ కేసుల సంఖ్య ఉండగా.. వారానికే లక్ష, రెండు వారాలకే రెండు లక్షల స్థాయిని దాటింది. జనవరి 20 నాటికి మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. జనవరి 24న గరిష్ఠంగా 3.47 లక్షల కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి క్రమంగా కేసులు తగ్గడం మొదలైంది. జనవరి 31 నాటికి 2 లక్షలకు పైగా ఉన్న కేసుల సంఖ్య ఫిబ్రవరి 1 వచ్చే సరికి 1.67 లక్షలకు చేరింది. ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం వెలువరించిన లెక్కల ప్రకారం ఆ సంఖ్య 34,113కు చేరింది.

తొలి రెండు వేవ్‌ల సమయంలో దేశమంతా ఆంక్షల చట్రంలో చిక్కుకుంది. అయితే, మూడో వేవ్‌ సమయంలో కేవలం నైట్‌ కర్ఫ్యూలు, విద్యా సంస్థల బంద్‌, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్యపై ఆంక్షలు.. సభలు, సమావేశాలపై నిషేధం వంటివి మించితే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించలేదు. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేశారు. విద్యా సంస్థలు తెరించేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

దేశంలో జనాభాకు పెద్ద ఎత్తున కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. 18 ఏళ్ల పైబడిన వారితో పాటు 15-18 ఏళ్ల వయసు వారికీ ఒకటో డోసు ఇచ్చారు. దీనికి తోడు 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ డోసు వేస్తున్నారు. ముందు ముందు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. అయితే, మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం.. ఎక్కువమంది వ్యాక్సిన్లు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆస్పత్రుల వరకు వెళ్లాల్సిన పరిస్థితులు తక్కువే కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.