COVID19 cases in India
Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35వేల 094 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 765 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 356 కేసులు వచ్చాయి. నల్గొండ జిల్లాలో 58, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కేసులు, ఖమ్మంలో 34 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 648 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
Biden Covid Positive : అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా పాజిటివ్..
రాష్ట్రంలో నేటివరకు 8,12,381 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 03వేల 661 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 609కి చేరింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 31వేల 265 కరోనా టెస్టులు చేయగా.. 640 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
COVID-19 vaccine: ప్రధాని మోదీకి అభినందనలు: బిల్ గేట్స్
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.21.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/doPkoTuNUU— IPRDepartment (@IPRTelangana) July 21, 2022