Biden Covid Positive : అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా పాజిటివ్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని వైట్ హౌస్ తెలిపింది.

Biden Tests Positive For Covid 19, Has ‘mild Symptoms’ (2)
Biden Covid Positive : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు గురువారం రాత్రి (జూలై 21) అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా సోకిన అధ్యక్షుడు బైడెన్‌కు స్వల్పంగానే కరోనా లక్షణాలు ఉన్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఆయన అధ్యక్ష భవనంలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు యాంటీవైరల్ డ్రగ్ పాక్స్‌లోవిడ్ తీసుకున్నట్టు తెలిపారు.

Biden Tests Positive For Covid 19, Has ‘mild Symptoms’
వైట్‌హౌస్‌లోనే ఆ సమయంలో బైడెన్ అన్ని విధులను పూర్తిగా కొనసాగిస్తారని తెలిపారు. వైట్ హౌస్ సిబ్బందితో ఫోన్ ద్వారా బైడెన్ సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రణాళికాబద్ధమైన సమావేశాలలో ఫోన్ లైన్ ద్వారా నివాసం నుంచే జూమ్ ద్వారా బైడెన్ పాల్గొనున్నారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ బైడెన్ తీసుకున్నారు. ఇటీవలే బూస్టర్ డోస్‌ను కూడా ఆయన తీసుకున్నారు. కరోనా సోకిన కారణంగా ఐసోలేషన్‌లోనే ఉన్నా… బైడెన్ తన అధికారిక విధులను నిర్వర్తిస్తున్నారని వైట్ హౌస్ అధికారికంగా స్పష్టం చేసింది.
Read Also : US President Joe Biden: జో బైడెన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడా? శ్వేతసౌధం ఏమందంటే..