Telangana Covid News Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

రాష్ట్రంలో ఇంకా 336 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111.

Telangana Covid Report

Telangana Covid News Update : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 10వేల 156 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 25 కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 31 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇంకా 336 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో నేటివరకు 7,92,108 కరోనా కేసులు నమోదవగా.. 7,87,661 మంది కోలుకున్నారు. క్రితం రోజు రాష్ట్రంలో 14వేల 597 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 28మందికి పాజిటివ్ గా తేలింది.

Vaccination: ఒక్కరికీ వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి లేదు – సుప్రీం కోర్టు

అటు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా 3 వేలకుపైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా కొత్త కేసులు 2వేల 500కు దిగిరావడం కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. మరోవైపు కొత్త కేసుల కంటే.. రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూలాంశం.

నిన్న 4.19 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 568 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 18.6 శాతం మేర కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో 2వేల 911 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి.
దేశంలో నేటివరకు 4.30 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. అందులో 98.74 శాతం మంది వైరస్‌ను జయించారు. యాక్టివ్ కేసులు 19వేల 137(0.04 శాతం) స్వల్పంగా తగ్గాయి. నిన్న మరో 20 మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 5.23 లక్షల మరణాలు సంభవించాయి. ఇక నిన్న 16,23,795 టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 189 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు

ఇది ఇలా ఉంటే.. వ్యాక్సిన్ తీసుకునే విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయలేమంటూ సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చంది. పలు సేవలు పొందేందుకు టీకాను తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా రవాణాను వినియోగించుకోవడానికి, సబ్సిడీలో ఆహార ధాన్యాలు పొందడానికి పలు రాష్ట్రాలు టీకాను తప్పనిసరి చేయడాన్ని ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ క్రమంలో జస్టిస్ ఎల్ నాగేశ్వర్రావు, జస్టిస్ బీఆర్ గావైతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది.