Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు

యావత్ భారతదేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు

Covid Testing

Covid Cases: యావత్ భారతదేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో కొత్తగా 3157 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ప్రస్తుతం 19వేల 500 యాక్టివ్ కేసులుండగా.. వాటిని 0.05 శాతంగా తేల్చారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ 4కోట్ల 30లక్షల 82వేల 345 కేసులు నమోదు కాగా, వాటిలో 5లక్షల 23వేల 869 మరణాలు నమోదయ్యాయి.

దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఆదివారం ఒక్కరోజులో 2723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావం నుంచి మొత్తంగా 4కోట్ల 25లక్షల 38 వేల 976 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

472 రోజుకు చేరిన కరోనా వ్యాక్సినేషన్

472 రోజులుగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 189.23 కోట్ల డోసులను అందజేశారు. ఆదివారం ఒక్కరోజు 4లక్షల 2వేల 170 డోసుల టీకాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 189కోట్ల 23లక్షల 98వేల 347 డోసుల టీకాలు అందజేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.