TSRTC : డుగ్గు.. డుగ్గు బండిపై రాలేను.. ఆర్టీసీ బస్సులో వస్తా.. ఇష్టమైతే చేసుకో లేకపోతే లేదంటున్న వరుడు

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.

TSRTC : డుగ్గు.. డుగ్గు బండిపై రాలేను.. ఆర్టీసీ బస్సులో వస్తా.. ఇష్టమైతే చేసుకో లేకపోతే లేదంటున్న వరుడు

Tsrtc (2)

Updated On : November 2, 2021 / 4:22 PM IST

TSRTC : తెలంగాణ ఆర్టీసీని నష్టాల్లోంచి బయటపడేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. పండుగల వేళ స్పెషల్ చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడిపి ఊహించినదానికంటే మూడు కోట్లు అధిక ఆదాయం ఆర్జించింది ఆర్టీసీ. ప్రజలకు దగ్గరయ్యేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు ఆర్టీసీ అధికారులు.

చదవండి : Phone Stopped Bullet: బుల్లెట్ ప్రూఫ్‌లా మారి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్

దసరా వేళ సుఖీభవ వీడియోతో ప్రజలను ఆకట్టుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు మరో కొత్త మేమెతో వచ్చింది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన బులెట్ బండి పాటను తమను అనుకూలంగా మార్చుకొని ఓ మీమ్‌ని తయారు చేసింది. ఇది పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం నుంచి బయటపడాలంటే ఆర్టీసీ ప్రయాణమే మేలనే సంకేతం ఇస్తుంది.

ఇక ఈ మీమ్‌‌లో వరుడు తాను డుగ్గు.. డుగ్గు .. డుగ్గు బులెట్ బండిపై రాలేను ఎందుకంటే పెట్రోల్ రేట్ రూ.120కి చేరింది.. నేను ఆర్టీసీ బస్సులో వస్తా ఇష్టముంటే చేసుకో లేకపోతే లేదు అంటూ వరుడు వధువుకు చెబుతున్నట్లుగా ఉంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు మీ క్రియేటివిటీకి నమస్కారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చదవండి : Bamma Bullet Bandi dance: బుద్దిగా కూర్చున్న తాత..‘బుల్లెట్ బండి’పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ