Warangal Super Speciality Hospital
Warangal Super Speciality Hospital : వరంగల్ లో 2వేల పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు. హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 1100 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ జీవో 158 విడుదల చేశారు. సివిల్ వర్క్స్, పారిశుద్ధ్యం, మంచి నీరు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, వైద్య పరికరాలు, ఇతర పనుల కోసం ఈ నిధులు కేటాయించనున్నారు. TSMIDC, DME ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు.
WhatsApp New Feature : పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెట్టారా? క్షణాల్లో డిలీట్ చేయొచ్చు!
రూ.1100 కోట్లలో సివిల్ వర్క్స్ కి రూ.509 కోట్లు.. మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ.20.36 కోట్లు.. మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం 182.18 కోట్లు.. వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు.. చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు.
Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ
వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో భాగంగా వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో జైలును యుద్దప్రాతిపదికన ఖాళీ చేయించారు. సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలను ఇతర ప్రాంతాల్లో ఉన్న సబ్ జైలుకు తరలించారు. మరి కొంతమందిని హైదరాబాద్ చంచల్ గూడకు తరలించారు. జైలు ఖాళీ అయిన తర్వాత ఇటీవలే సీఎం కేసీఆర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో త్వరితగతిన ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే నేడు ఆసుపత్రికి నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పాటు అందుకోసం 1100 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవో జారీ చేశారు. కాగా ప్రస్తుతం ఉన్న గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిగా మార్చనున్నారు.